నేడు సీఎస్‌ను కలవనున్న టీఎన్జీవో జేఏసీ
హైదరాబాద్: ఉద్యోగులపై కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ రోజు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వనుంది. పీఆర్స్, డీఏ, సకలజనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇవ్వనున్నారు. సమస్యల పరిష్కారించకపోతే వచ్చే నెల 9న ధర్నా, 14న జిల్లా కలెక్టరేటు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఆందోళన చేయనున్నట్లు తెలియజేశారు.



