నేతకానులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

నేతకానులను ఎస్టీ జాబితాలో చేర్చాలి 

కొత్తగూడ జనంసాక్షి:మహాబూబాబాద్ జిల్లా కొత్తగూడ,గంగారం మండల్లాలోని
(ఎస్సీ) నేతకానులను ఎస్టి జాబితాలో చేర్చాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడ లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.మండల నాయకుడు పశువుల గట్టయ్య మాట్లాడుతూ స్వాతంత్రం పూర్వం నుండి నేటి వరకు నేతకానులను అణిచివేస్తున్నారని అన్నారు.2005 నాటికి సాగులో భూములకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కు పత్రాలు పట్టాలు కల్పించాలని నేతకాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దుర్గం సాంబయ్య నారాయణ జిమ్మిడి శ్రీను జనగాం రవి తదితరులు పాల్గొన్నారు.