హత్నూర,(జనం సాక్షి)
మండలం పరిధిలోని చింతల్ చెరు గ్రామంలో గల కార్మెల్ ప్రైవేటు విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలు నేత్ర పర్వంగా సాగాయి.కార్యక్రమానికి విచ్చేసినటువంటి అథితులకు సాదరంగా ఆహ్వానం పలికారు.ప్రార్థనా గీతాలు ఆలపించి ప్రత్యేక నృత్యాలతో స్వాగతించారు.ముందుగా ప్రాథమిక పాఠశాలలోని 1,2,3 వ తరగతి విద్యార్ధులు పలు సినీగేయాలపై చేసిన నృత్యాలు చూపరులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. అనంతరం 4,5 వ తరగతి విద్యార్ధులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్టే ఆకట్టుకున్నాయి. నవదుర్గ వేషాధారణ,అతిగా చరవాణి ఉపయోగం వల్ల జరిగే అనర్ధాలు,తమాషా నృత్యాలు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రత్యేకత తదితర కార్యక్రమాలపై విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు వార్షికోత్సవానికే వన్నె తెచ్చాయి. విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు మురిసిపోయిన అథితులు ప్రశంసల జల్లులు కురిపించారు.ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన ఐ.జి.ఎస్ గ్రూపు చైర్మన్ జనాబ్ ఇఫ్తార్ షరీఫ్,ప్రత్యేక అథితి జనాబ్ మిర్ జులిఫిక్కర్ అలి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటనర్సింలు, అధ్యక్షులు సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పిజి కళాశాల ప్రిన్సిపాల్ విన్సెంట్ అరోకియాదాస్,రమేష్ గౌడ్,బాలరాజు,వినయ్ కుమార్ రెడ్డి,స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ శార్దాన్ ఆంటోని తదితరులు పాల్గొన్నారు.




