కూకట్ పల్లి (జనంసాక్షి ):తెలంగాణా ప్రజలకు వివిధ కార్యక్రమాల ద్వారా పోరాట యోధుల చరిత్ర స్వాతంత్ర్య స్ఫూర్తి, ప్రేరణను అందించి దేశభక్తిని మేల్కొల్పే ప్రయత్నమే ఈ ఉత్సవాలు అని కూకట్ పల్లి జిల్లా ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రావుస్ గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ పొలసాని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలను యావత్ ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా జరుపుకున్నాము.దేశానికి ఆగష్టు 15, 1947 న స్వతంత్రం వచినప్పటికిని, నైజాం పాలిత ప్రాంతంలో, ఎంతోమంది త్యాగాల, పోరాటాల ఫలితంగా, 13 నెలల తరువాత, 17 సెప్టెంబర్ 1948 న భారత స్వాతంత్ర్య చిహ్నమైన త్రివర్ణ పతాకం ఎగురవేయడంతో బానిసత్వ చీకట్లు తొలిగించికొని స్వతంత్ర్య భారతంలో విలీనం అయింది. విలీనం కాబడి 2023 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవ్తున్న సందర్భం లో నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలను సెప్టెంబర్ 17, 2022 నుండి రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్ర్య అమృతోత్సవాలు ఆ త్యాగధనులందరినీ స్మరించుకోవడానికి మంచి అవకాశం.బానిసత్వ పాలనలో ప్రజలు వారి చరిత్ర ఆవశ్యకతను తెలియచేస్తూ చరిత్ర మరచిన సమాజం భవిత అంధకారం.ఈ సందర్భంగా కూకట్ పల్లి జిల్లా ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రావుస్ గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ పొలసాని ప్రభాకర్ రావు,జిల్లా ఉత్సవ సమితి కార్యాధ్యక్షులుగా ప్రముఖ వ్యాపారవేత్త, భారత వికాస్ పరిషత్ సభ్యులు చింతపట్ల అనిల్ కుమార్ లు ఈ అమృతోత్సవాల సందర్భంగా సంవత్సరం పాటు జరగబోయే కార్యక్రమాల విస్తృత సమాచారాన్ని, యోజనను తెలియచేసారు. _ నవంబర్ 2022 లో యువకులు, కళాశాల విద్యార్థులతో యువ సమ్మేళనం _జిల్లా లోని అన్ని బస్తిలలోని లక్షలలాది కుటుంబాలకు తెలంగాణ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రేరణను జనజాగరణ ద్వారా తెలియచేయడానికి ప్రయత్నం. _ ప్రతిష్ఠిత వ్యక్తులు, మేధావులతో అన్నినగరాలలో సదస్సులు _17 సెప్టెంబర్ 2023 న బస్తిలలో త్రివర్ణపతాక వందనం తో నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను విజయవంతముగా పూర్తిచేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ కూకట్ పల్లి భాగ్ అధికారులు సంఘచాలకులు, సుభాష్ చంద్ర బోస్, సికింద్రాబాద్ విభాగ్ కార్యవాహ , శ్రీ భరతపుడి శ్రీనివాస్,కూకట్ పల్లి భాగ్ కార్యవాహ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




