సిఎం కెసిఆర్‌ను కోరిన సగం సభ్యులు
హైదరాబాద్,నవంబర్11((జనంసాక్షి)): నోటరీలను గెజిటెడ్ అధికారులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జంటనగరాల్లోని కోర్టులు, నోటరీ ప్రాక్టీషనర్స్ అడ్వొకేట్‌లను గెజిటెడ్ అధికారులగా గుర్తింపునివ్వాలని తెలంగాణ అడ్వొకేట్ నోటరీస్ అసోసియేషన్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేసింది. ఈమేరకు అసోసియేషన్ తరపున అధ్యక్షుడు గంజి యాదగిరి, కార్యదర్శి కుంట్ల మురళీధర్ వినతి పత్రాన్నిఅందజేశారు. ప్రాక్టీస్‌చేస్తున్న నోటరీ అడ్వొకేట్‌లను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం నోటరీ పబ్లిక్‌గా, ఓత్ కమిషనర్లుగా నియమిస్తారు. కోర్టు అధికారిగా అధికారిక గెజిట్‌లో పేర్కొన్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన విధంగా స్పందించి నోటరీ అడ్వొకేట్‌లు సర్టిఫికెట్స్, డాక్యుమెంట్లపై చేసే సంతకాలను గెజిటెడ్ అధికారుల సంతకాలుగా గుర్తింపునివ్వాలని వారు విజ్ఞప్తిచేశారు. వెంటనేఆయా డిపార్ట్‌మెంట్‌లకు సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన వారిలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ యాదగిరి, కోశాధికారి కరణం బలరాం, ఉపాధ్యక్షులు జె. సుదర్శన్‌చారి, సభ్యులు ఆర్. దేవదాస్, ఈ. సురేశ్‌రావు తదితరులు ఉన్నారు.




