Thursday, 5 November 2026

నో హెల్మెట్‌..నో పెట్రోల్‌

హైదరాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): జైళ్లశాఖ బంకుల్లో హెల్మెట్‌ ధరించనివారికి పెట్రోల్‌ పోయవద్దనినిర్ణయం తీసుకున్నట్లు జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌ తెలిపారు. హెల్మెట్‌ ధరించకపోవటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్న ఆయన మిగతా పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు కూడా ఇలా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జైళ్లశాఖ బంకుల్లో నాణ్యత వల్ల మంచి ఆదరణ లభిస్తోందని వెల్లడించారు.