Tuesday, 3 November 2026

న్యాయవాదిపై టీఆర్ఎస్,ఎమ్మెల్యే అనుచరుల దాడి

మహిళలపై దాడులకు దిగిన ఎమ్మెల్యే అనుచరులు.

తెలంగాణాలో మహిళలకు,సామాన్య ప్రజలకు అన్యాయం జరిగింది:న్యాయవాదుల ఆగ్రహం.

ఇబ్రహీంపట్నం మార్చి 6(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు మహిళా దినోత్సవం సంబరాలు చేసుకుంటూ మరోవైపు ఎమ్మెల్యే అతని అనుచరులు దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అని సామాన్య ప్రజలు,న్యాయవాదులు మండిపడుతున్నారు.మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.అయితే రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన ఇండ్ల స్థానంలో మాకు న్యాయం చేయండంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వద్దకు మహిళలు,గ్రామస్థులు రాగా వాళ్ళ సమస్యలు తీర్చకపోగా దాడులకు పాల్పడుతుండటం చూసి పక్కనే ఉన్నవాళ్లు వీడియోలు తీసిన న్యాయవాది మొబైల్ లాక్కొని దాడులకు పాల్పడం పై మీడియా ద్వారా ప్రశ్నించారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ…ఒక ఎమ్మెల్యే ముందే న్యాయవాది ఫోన్ లాక్కొని దాడికి పాల్పడటం ఏంటని అగ్రహిస్తూన్నారు.ఎమ్మెల్యే,అతని అనుచరులపై తగు చర్య తీసుకోవాలని న్యాయవాదుల డిమాండ్ చేస్తున్నారు.మహిళలు,న్యాయవాది మహేష్ ,తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని,ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.న్యాయవాదిపై దాడి చేసిన ఎమ్మెల్యే,అతని అనుచరుల  పై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముద్దం వెంకటేశం డిమాండ్ చేశారు.న్యాయవాది పై దాడికి నిరసనగా రేపు(సోమవారం)కోర్టు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు…