హుజూర్ నగర్ ఆగస్టు 25 (జనం సాక్షి): పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో తనకు న్యాయవాదుల సహకారం చాలా అవసరమనీ, న్యాయవాదుల నుండి సహకారాన్ని కోరుతున్నానని నూతన సీనియర్ సివిల్ జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జెట్టి శ్యాంకుమార్ అన్నారు. గురువారం బార్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన పరిచయ స్వాగత, సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ హైకోర్టు వారి ఆదేశాల మేరకు 2017 కు పూర్వం ఉన్న కేసులను త్వరితగతిన విచారించవలసి ఉన్నదని అందువల్ల న్యాయవాదులు తమ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జక్కుల నాగేశ్వరరావు, నారాపరాజు శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసరావు, రవికుమార్, వి.జి.కే. మూర్తి, అంబటి శ్రీనివాస్ రెడ్డి, నట్టే సత్యనారాయణ, మీసాల అంజయ్య, చనగాని యాదగిరి, బట్టిపల్లి ప్రవీణ్, రమణారెడ్డి, వెంకట రెడ్డి, కొట్టు సురేష్, జక్కుల వీరయ్య, కమతం నాగార్జున, సైదా హుస్సేన్, చక్రాల వెంకటేశ్వర్లు, సురేష్ నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్, శ్రీనివాస నాయక్, లతీఫ్, మహేష్, వట్టికూటి అంజయ్య, నారాయణరెడ్డి, పాలేటి శ్రీనివాసరావు, కొణతం శ్రీనివాస్ రెడ్డి, చల్లా కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల సహకారం చాలా అవసరం




