*సీపీఎం*
రామన్నపేట ఆగస్టు 25 (జనంసాక్షి) రామన్నపేట – వేములకొండ రూటు ఆర్.టి. సి బస్సును పునరుద్ధరించి ప్రజల సమస్యను తీర్చాలని సీపీఎం శోభనాద్రిపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ అంజనేయులుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీపీఎం మండల కమిటీ సభ్యులు యండి రషీద్,శాఖ కార్యదర్శి గోగు లింగస్వామి మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా గ్రామాలకు బస్సు రాకపోవడంతో ప్రయాణికులు,విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పత్తి సీజన్ కావడంతో ఆటోల సౌకార్యం లేక ప్రజలు మండల కేంద్రానికి రాలేక పోతున్నారు. నీర్నెముల,లక్మాపురం, శోభనాద్రిపురం,వేములకొండ గ్రామాల విద్యార్థులు సుమారుగా 250 మంది విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఆర్థిక భారాన్ని మోయలేక చదువుకు దూరమవుతున్నారు. ఆర్.టి. సి అధికారులు చొరవ తీసుకొని బస్సును పునరుద్ధరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ కొమ్ము అంజమ్మ, సిపిఎం నాయకులు కొమ్ము అంజయ్య, తాడూరి కృష్ణ, బొడిగే వెంకన్న ,నల్లబోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




