భళ్ళున కూలిందేమో
స్వప్న చిత్రం
కన్నీటి బొట్టైంది
హృదయ తంత్రి
అకస్మాత్తుగా తెగిందేమో
రాగం శృతి తప్పిన
గానమైంది
మల్లె డోలికలు పేలికలై
వాడిపోయాయేమో
మృత్యు ఘంటికలు
చారికలై మరణాల్ని మ్రోగించాయి
దేహం నుండి విదారకంగా
మనసు విడివడిందేమో
జీవితం ఆకుపచ్చని
సాక్ష్యాన్ని కోల్పోయింది
సవ్వడులు ఆటుపోట్లతో
ఆగిపోయాయేమో
ఆర్ట్రతను కోల్పోయి
జీవితం ఒంటరిదైంది
– తిరునగరి శ్రీనివాస్
8466053933




