పంచాయతీ గ్రాండ్ విడుదల చేయాలి
*దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కే రాజిరెడ్డి
దోమ అక్టోబర్ 1( జనంసాక్షి )
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు నిదులు విడుదల చేయాలని దోమల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పంచాయతీ రాష్ట్రం నుంచి ప్రతి నెల రావాల్సిన నిధులు సెప్టెంబర్ నెల వరకు కూడా రాలేదని చెప్పారు. ఎస్ఎస్సి నిధులు నాలుగుసార్లు వచ్చాయని ఇంకా ఐదు నెలల బకాయిలు ఉన్నాయని కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన ఆర్థిక సంవత్సరం 2022-23 నిదులు ఇప్పటివరకు ఒక్క నెల నిధులు కూడా పంచాయతీలకు విడుదల చేయలేదని దీంతో పంచాయతీ నిర్వీర్యమైన పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు సర్పంచుల పై దయతల్చి వెంటనే పంచాయతీ గ్రాంట్లను విడుదల చేయాలని ప్రకటనలో తెలియజేశారు .