పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయ సాధనకు కృషి చేయాలి
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపురం వెంకటయ్య గౌడ్
కుల్కచర్ల, సెప్టెంబర్ 25(జనం సాక్షి):
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సాధనకు ప్రతి యువకుడు కృషి చేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపురం వెంకటయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు గాదె మహిపాల్ ముదిరాజ్, యువ నాయకులు కరణం లక్ష్మీకాంతరావు అన్నారు.ఆదివారం కుల్కచర్ల బిజెపి మండల కార్యాలయంలో పండిట్ జీ జయంతోత్సవ సందర్భంగా
చిత్రపటానికి బీజేపీ, బీజేవైఎం నేతలు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం
మండల కేంద్రంలో, ఘనపూర్ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బోయిని భీమయ్య ఆధ్వర్యంలో జరిగిన దీన్ దయాల్ జయంతి సందర్భంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఏకత్మాత మానవతావాదం సూచించిన సిద్దాంతకర్త పండిట్ జీ అన్నారు.ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలని అంత్యోదయ పథకాన్ని సూచించిన హిందూత్వవాది పండిట్ దీన్ దయాల్ జీ అన్నారు.అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకిబాత్ కార్యక్రమాన్ని మండల పరిధిలోని వివిధ గ్రామాలలో తిలకించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రలింగం, ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగ్యేం శ్రీనివాస్, యువమోర్చా మండల అధ్యక్షులు గడుసు మహిపాల్, ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, మాజీ ఎంపిటిసి ఆంజనేయులు, మండల ట్రెజరర్ చేల్లాపూర్ ఆంజనేయులు, కృష్ణారెడ్డి, సుంకు మల్లేశం, ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి కాటన్ పల్లి ప్రవీణ్ ,సోషల్ మీడియా కన్వీనర్ నరేష్ గౌడ్, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, గొల్ల ఉదయ్, అంగడి ప్రదీప్, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.