పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

బోధన రూరల్ సీఐ శ్రీనివాసరాజు
ఫోటో రైటప్ 30 బీడీఎన్,  శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న రూరల్ సీఐ
ఎడపల్లి, ఆగస్టు 30 ( జనంసాక్షి ) : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలను ప్రతీ ఒక్కరు శాంతియుతంగా జరుపుకొని మత సామరస్యాన్ని చాటాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండపాల నిర్వాహకులదేనని ఆయన అన్నారు. నిమజ్జనం జరిగే వరకు ప్రతీ ఒక్కరు పోలీసులకు తమ సహకారం అందించాలని రూరల్ సీఐ శ్రీనివాసరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ఎస్సై పాండేరావు, ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్, ఎడపల్లి ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీ బాబా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నిర్వాహకులు, యువకులు పాల్గొన్నారు.