Tuesday, 3 November 2026

పచ్చి రొట్ట,ఎరువుల ఉపయోగాలపై అవగాహన ….

జూలై 11, జనం సాక్షి
దౌల్తాబాద్ మండల పరిధిలో లింగరాజుపల్లి గ్రామం లో భూ సారాన్ని పెంచే పశువుల ఎరువుల లభ్యత నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు పచ్చి రొట్ట పైర్ల సాగును పెద్ద ఎత్తున ప్రోస్తాహిస్తున్నారు . అధిక దిగుబడినిచ్చే పచ్చి రోట్ట,జీలుగా,జనును వంటి పేర్లను తోలకరిలో ప్రధాన పంటలు విత్తేముందు నెలలో కలియదున్నితే భూసారం పెరగడంతోపాటు,రసాయనిక ఎరువులపై పెట్టే ఖర్చును రైతులు తగ్గించుకోవచ్చన్నారు.
భూ భౌతిక స్థితి ఆరోగ్యంగా ఉంటేనే పంటల సాగులో ఆశించిన ఫలితాలోస్తాయని, పదే పదే రసాయన ఎరువులపైనే ఆధారపడితే దీర్ఘకాలంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని అన్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నేలలు గెడుసబారిపోయి రసాయన ఎరువులు దుష్ఫలితాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయన్నారు. పచ్చి రొట్ట,జీలుగ వల్ల
నేల నుండి కరిగే పోషకాలు బయటకు రాకుండా నిరోధించడం, నేల నిర్మాణం దెబ్బతినకుండా నిరోధించడానికి గ్రౌండ్ కవర్ అందించడం,తక్కువ నేల ప్రొఫైల్స్ నుండి పంట పోషకాలను తీసుకురావడం
కలుపు మొక్కలను అణచివేయడం మరియు కలుపు మొక్కల పెరుగుదలను నిరోధించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేత కనకరాజు,ఏఈఓ సంతోష్ మరియు రైతులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.