Tuesday, 3 November 2026

పటిష్ట నాయకత్వం లేని కాంగ్రెస్‌

అందరి దృష్టి సిఎం పదవిపైనే

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీకి తెలుగు రాస్ట్రాల్లో నాయకత్వ సమస్య తీవరంగా ఉంది. ఎపిలో నాయకవ్‌ సమస్య లేకున్నా అక్కడ సంస్థాగత బలం లేదు. ఇకపోతే తెలంగాణలో అంతా నాయకులే. ఎవరికి వారు తామే సిఎం అభ్యర్థి అన్న ధోరణిలో ఉన్నారు. ఆలూచూలూ లేదు.. అన్న చందంగా తామే అధికారంలోకి వచ్చామన్న అతివిశ్వాసంతో ఎవరికి వారు కాబోయే సిఎం అన్న రీతిలో ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. దీంతో సమస్యలపై పోరాడడం కన్నా గోతులు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. రాహుల్‌ పగ్గాలు చేపట్టాక మార్పులు వస్తాయని భావించారు. అయితే ఆయన కూడా చల్నేదో బాలకిషన్‌ అన్న రీతిలో పార్టీని సాగిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి దూకుడుగా మాట్లాడగానే కోమటిరెడ్డి బ్రదర్స్‌, పొంగులేటి తదితరులు ఖండిస్తారు. ఇలా సమన్వయ లోపం కూడా పార్టీలో కొట్టొచ్చినట్లు కనినిస్తోంది. అధికారం కోల్పోయి నాలుగేళ్లవుతున్నా పటిష్ట స్థితికి అవసరమైన చర్యలు తసీఉకోక పోవడం కారణంగా కాంగ్రెస్‌ తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో వాటిని ఎదుర్కొనే వ్యూహంలో విఫలం అవుతున్నాయి. పిసిస చీఫ్‌గా తెలంగాణలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ కొనసాగడంతో ఈ పదవిపై ఆశపెట్టుకున్న కోమటిరెడ్డి బహిరంగగానే విమర్వలకు దిగుతూనే ఉన్నారు. ఆయన కూడా సిఎం పదవికి అర్హుడిగా ముందు వరసలో ప్రచారం చేసుకుంటున్నారు.జైపాల్‌ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌, పొన్నాల, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అంతా సిఎం క్యాండింట్లే. ఇదే కాంగ్రెస్‌కు శాపంగా పరిణమించింది. ఇరురాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను వెన్నాడుతున్న పాపాలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎపిలో చంద్రబాబు ఏదో చేశారని, తెలంగాణలో కెసిఆర్‌ మరేదో చేశారని చెబుతూ ప్రజల్లోకి వెల్లేందుకు నానాయాతన పడుతున్నారు. అన్నింటికి మించి తెలంగాణలో అనేక విధాలుగా పోరాడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. రెండు రాష్ట్రాల్లోనూ సమర్థులైన నేతలు లేకపోవడం, ఛరిష్మా లేకపోవడంతో కాంగ్రెస్‌ నెగ్గుకు రాలేకపోతోంది. తాజాగా రాహుల్‌ను రప్పించడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు. నిజానికి ఎపిలో రఘువీరాకు పెద్దగా అసమ్మతి లేకపోవచ్చేమో కానీ తెలంగాణలో ఉత్తమ్‌ నాయకత్వంపై మాత్రం సమస్యలు ఉన్నాయి. దీనిని అధిగమించేందుకు ఆయన రాహుల్‌ సభపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇకపోతే రాష్ట్రవిభజన తరవాత రెండు రాష్ట్రాల్లో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్‌ వీధుల్లో పడుతూలేస్తూ గత వైభవం కోసం పాకులాడుతోంది. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండడంతో ఇప్పటి నుంచే కార్యక్రమాలతో ముందకు సాగుతున్నారు. విషయం ఏదైనా యాగీ చేయడమే ప్రధానం అన్న రీతిలో కార్యక్రమాలు చేస్తోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడదే పరిస్థితిని కొనసాగి స్తోంది. ఎపిలో ప్రత్యేక¬దా, తెలంగాణలో ప్రాజెక్టులపై పోరు ప్రధానాంశాలుగా పోరు సాగించి చతికిల పడ్డారు. విభజనతో ఎపిలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్‌ మెల్లగా ముందుకు సాగుతోంది. వైకాపా నిరంతరంగా పోరాడుతున్నా కాంగ్రెస్‌ అంతకుమించి కార్యక్రమాలను చేస్తూనే ఉంది. విభజన అపవాదు నుంచి ఏపీ కాంగ్రెస్‌ పార్టీ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన ఏపి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. వైకాపాలో చేరి అదృష్టం కోసం ఎదురు చూస్తున్నారు. విభజన పాపం కన్నా ప్రత్యేక¬దాను ఆధారం చేసుకుని పోరాటాలు చేసినా ఫలించడం లేదు. ఇకపోతే తెలంగాణలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ టిఆర్‌ఎస్‌ను విమర్శలు చేస్తున్నా పెద్దగా స్పందన కానరావడం లేదు. అందుకే ప్రధానంగా రైతుల సమస్యలను భుజానకెత్తుకున్నారు. దీనికి తోడు రాహుల్‌ సభ ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా ఇప్ప్పుడు నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది.జరిగిన తప్పిదాలేమిటి? లోటుపాట్లేమిటన్న అంశాలను చర్చించడం కూడా అవసరం. రాహుల్‌ నాయకత్వం తరవాత తెలుగు రాష్ట్రాల్లో అనుసరించే వ్యూహం ఏమిటో ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌ గత పాపాలను విస్మరించి మాట్లాడితే ప్రజలు నమ్మరని గ్రహించడం లేదు. అందుకే గతాన్ని మరుగున పరచాలనుకున్నవారికి కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. ఈ దశలోనైనా సమూల ప్రక్షాళనకు సంసిద్ధం కాకపోతే పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ దిశగా ప్రయత్నాలు చేసినా బలమైన టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం కష్టమే కావచ్చు.