పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభం..

చేర్యాల (జనంసాక్షి) జులై 26 : టీయూఎఫ్ఐ డీసీ నిధుల ద్వారా చేర్యాల పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. పనులకు మున్సిపల్ చైర్పసన్ అంకుగారి స్వరూపరాణి-శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు చెవిటి లింగం, మంగొలు చంటి, ఆడెపు నరేందర్, స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ డి.శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.