Tuesday, 3 November 2026

పడకేసిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు…

అల్వాల్ (జనంసాక్షి) జూలై 30

వర్షాకాలం వచ్చిందంటే ప్రజల్లో వణుకు పుడుతుంది. దోమల వృద్ధి చెందడం పారిశుద్ధ్యం క్షిమించడంతో అంటు రోగాలు విష జ్వరాలు విజ్వంబిస్తుంటాయి. ప్రజలు వేలకు వేలు ప్రైవేటు ఆసుపత్రులకు ధారబోస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ మార్కెట్ దగ్గర చెత్త రోడ్లమీద ఏరులై పారుతూ  శానిటేషన్ ఇన్స్పెక్టర్ సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడంతో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు ముక్కు మూసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత వారం రోజుల నుండి పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో రోడ్డు పక్కనే చెత్తాచెదారం పేరుకుపోయి దీనిపై ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు విజువంబిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు చేయడంలో జిహెచ్ఎంసి అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపించారు.