తక్కువ సనిమాలే అయినా పాపులారిటీ ఎక్కువే

మురుగదాస్‌ సినిమాలంటే అందరీకి క్రేజీయే
ప్రముఖ కోలీవుడ్‌ దర్శుకుడు ఏ ఆర్‌ మురగ దాస్‌ తన తదుపరి సినిమాను అదే కోలీవుడ్‌ స్టార్‌ హీరోతో చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నట్టుగా తాజా సమాచారం. మురగదాస్‌ ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే అయినా వాటితో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అజిత్‌ హీరోగా చేసిన మొదటి సినిమా దిన. ఆ తర్వాత చేసిన రమణ భారీ హిట్‌ సాధించింది. అదే సినిమాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఠాగూర్‌ గా రూపొంది భారీ హిట్‌ సాధించింది.మురగదాస్‌ నుంచి వచ్చిన చిత్రాలు గజిని, స్టాలిన్‌, సెవెంత్‌ సెన్స్‌, తుపాకి, జయహో, కత్తి, స్పైడర్‌, దర్బార్‌. వీటిలో గజిని, తుపాకి, కత్తి భారీ హిట్‌ సాధించాయి. అయితే, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా స్పైడర్‌, కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్హీరోగా దర్భార్‌ చిత్రాలు రూపొందించగా అవి డిజాస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా దర్బార్‌ మూవీ మురగదాస్‌ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మూవీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో దాదాపు రెండేళ్ళు గ్యాప్‌ తీసుకున్న ఆయన, ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని తమిళ హీరో శింబు తో చేసేందుకు ఎª`లాన్‌ చేసుకుంటున్నారట. శింబు వరుస హిట్స్‌తో మంచి ఊపు విూదున్నారు. ప్రస్తుతం కూడా కొన్ని సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే మురగదాస్‌ దర్శకత్వంలో కూడా ఓ ప్రాజెక్ట్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు కోలీవుడ్‌ విూడియాలో వార్తలు వస్తున్నాయి