పత్తిరాము పై బిర్కూర్ మనం న్యూస్ విలేకరి తప్పుడు ప్రచురణ

 

రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో మాజి విండో చైర్మన్ పత్తిరాము పై బుధవారం రోజున
ఒక వార్త ప్రతికలో వచ్చిన తప్పుడు ప్రచురణ పై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు, క్రొత్తగా వచ్చిన ఎస్సై నితీష్ ను పత్తి రాము మరియు ఆయన అనుచరులు కలిసే సందర్భంలో, అదే సమయంలో అక్కడికి ముదిరాజ్ సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు ఎస్సై ను కలవడానికి వచ్చారు, అందరిని కలుపుకు పోయే మనస్తత్వం ఉన్న పత్తిరాము అందరితో కలిసి ఎస్సై నితీష్ ను సత్కరించి ఫొటోలు దిగారు, రుద్రూర్ లో ఏ సమస్య వచ్చినా మొదట స్పందించే వ్యక్తి , సభాపతి కి మరియు వారి తనయులకు నమ్మకంగా వుంటూ పార్టీ
సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని పోవడంలో మొదటి వ్యక్తి గా చెప్పవచ్చు, గత ఎన్నికల్లో కూడా ఆయనను రాజకీయంగా ఎదుర్కొనాలేక కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేసారు, పదవి లేకున్నా ప్రజాలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం అందించే ప్రతి పథకం ప్రజాలకు అందించాలని ప్రజాలకు, అధికారులకు, మద్య వారధిగా వుంటూ ప్రతి సమస్యను తీర్చడంతో ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ రెట్టింపు కావడం చూసి తట్టుకోలేని కొందరు నాయకులు పక మండల విలేకరులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని , ఈ విషయం పై పత్తిరాము సదరు వార్త రాసిన వ్యక్తికి వివరణ అడిగాగ రాజకీయ కుట్రలో భాగంగా ఒక విలేకరి , ఒక నాయకుడు ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు , మీరు ఎన్ని కుట్రలు పన్నిన నేను ప్రజల వైపే ఉంటానని తెలిపారు,