పత్తి కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి

పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే పత్తి కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు. సోమవారం డిండి రైతు వేదిక లో ఇలొవే _ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల మండల స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి ఉత్పత్తి ఉందని అన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశంలో 25 శాతం ఉత్పత్తి అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్తి ఉత్పత్తిలో దాదాపు 6 కోట్ల మంది రైతులు 10 కోట్ల మంది గ్రామీణ కార్మికులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రతి పంట ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు ప్రతి ఉత్పత్తిలో భాగస్వామ్యమైన సన్న మధ్య రైతులకు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత, కార్మిక చట్టాలు అమలు కోసం ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) కృషి చేస్తుందని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడం కోసం ,స్త్రీ పురుష వేతనాలలో వ్యత్యాస నివారణ కోసం, పని ప్రదేశాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు, రక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. పిల్లలను బడికి పంపాలని పనిలో పెట్టుకోవడం చట్టరిత్యా నేరమని ఆయన పేర్కొన్నారు. కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు ,శ్రమకు తగ్గ వేతనాలు పెంచాలనీ కోరే హక్కు ఉంటుందని అన్నారు. ఏఐటీయూసీ మండల కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.
ఈ సదస్సు లో సిపిఐ మండల కార్యదర్శి ఎస్ కనకాచారీ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎలిమినేటి హుస్సేన్, ఏఐటీయూసీ నాయకులు ఏ దేవయ్య, బి లింగమయ్య, లక్ష్మారెడ్డి, ఎండీ సలీం,డి ఆంజనేయులు, టి.నాగరాజు,బి సుధాకర్,మల్లయ్య, తిరుపతయ్య, ఎండీ జహంగీర్, విజయ్ కుమార్,గెలవయ్య, విష్ణు,వెంకటయ్య, పద్మ,శ్రావణి,తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు