మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన చింతకాని మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడు – కొండా గోపి.
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు మధ్యాహ్న భోజనాన్ని, చింతకాని మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడు కొండ గోపి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో పాటు ప్రతిరోజు భోజనం ఎలా ఉంటుందని, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. భోజనాన్ని తయారు చేసే వారికి పలు సూచనలతో పాటుగా వారి వేతనాలు సకాలంలో అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు.తర్వాత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుతో మాట్లాడి పాఠశాల సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొండా గోపి తో పాటు విజయ్, హరీష్, కృష్ణ, కాశిమ్ తదితరులు పాల్గొన్నారు.