పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే పత్తి కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు. సోమవారం దేవరకొండ లోని ఎండిఓ కార్యాలయంలో ఇలొవే _ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల మండల స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి ఉత్పత్తి ఉందని అన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశంలో 25 శాతం ఉత్పత్తి అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్తి ఉత్పత్తిలో దాదాపు 6 కోట్ల మంది రైతులు 10 కోట్ల మంది గ్రామీణ కార్మికులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రత్తి పంట ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు ప్రతి ఉత్పత్తిలో భాగస్వామ్యమైన సన్న మధ్య రైతులకు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత, కార్మిక చట్టాలు అమలు కోసం ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) కృషి చేస్తుందని అన్నారు. కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు ,శ్రమకు తగ్గ వేతనాలు పెంచాలనీ కోరే హక్కు ఉంటుందని అన్నారు. దేవరకొండ ఎంపిడిఓ పీవీసార్క్ శర్మ మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొస్తున్నాయని వాటి అమలకు సమిష్టిగా పని చేయాలని అన్నారు ఉపాధి హామీ రంగంలో పని చేసే కార్మికులకు పని కల్పిస్తున్నామని మిగతారంగంలోని వారికి కూడా పని కల్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.దేవరకొండ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎమ్ నిష్మీత మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడం కోసం ,స్త్రీ పురుష వేతనాల వ్యత్యాస నివారణ కోసం, పని ప్రదేశాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు, రక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. పిల్లలను బడికి పంపాలని పనిలో పెట్టుకోవడం చట్టరిత్యా నేరమని ఆమె పేర్కొన్నారు. ఈ సదస్సు లో ఏఐటీయూసీ నియోజక వర్గ అద్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, కార్యదర్శి నూనె రామస్వామి,పడమటిపల్లి గ్రామ సర్పంచ్ కిన్నర యాదయ్య,ఏ ఐ టీ యూ సీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి జూలూరి వెంకట్రాములు,అలమొని మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కిన్నేరి భారీములు, నీల వెంకటయ్య, ఎండీ వాహబ్ గ్యార వెంకటేష్,ముత్తమ్మ, మహేశ్,కృష్ణయ్య, యాదయ్య,అనసూయ,అంజమ్మ,వెంకటమ్మ, రఘురాం,సుమిత్ర, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు
పత్తి కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, పల్లా దేవేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి




