Tuesday, 3 November 2026

పదికోట్లు దాటిన మేడారం ఆదాయం

హనుమకొండ,మార్చి2(జనం సాక్షి): మేడారం జాతర హుండీల లెక్కింపునకు బ్రేక్‌ పడిరది. గత ఆరు రోజులుగా టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం జాతర హుండీలు లెక్కింపు జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా రెండ్రోజులు విరామం ఇచ్చారు. గురువారం తిరిగి లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 450 హుండీలు కౌంటింగ్‌ పూర్తయ్యాయి. 6 రోజుల పాటు జరిగిన కౌంటింగ్‌ లో.. కరెన్సీ రూపంలో మొత్తం 10కోట్ల 63 వేల 980 రూపాయల ఆదాయం వచ్చింది. ఇంకా 47 హుండీలు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీ, కాయిన్స్‌ లెక్కించాల్సింది ఉంది. లెక్కింపు తర్వాత పూర్తి వివరాలను రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ప్రకటిస్తారు. ఇప్పటి వరకు 6 రోజులపాటు జరిగిన హుండీల లెక్కింపు జరిగింది.