పరిపాలన సౌలభ్యం కై నూతన మండలం ఏర్పాటు చేయాలి

రాజాపేట, అక్టోబర్22 (జనంసాక్షి) : యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం లోని రఘునాధపురం గ్రామాన్ని మండలం ఏర్పాటుగా ప్రభుత్వం గెజిట్ ను విడుదలచేయలని కోరుతు  74వ రోజు రిలే నిరాహారదీక్ష లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు నూతన మండలాలు ఏర్పాటు చేసిందని, అదేతరహలో రఘునాధపురం మండలం ఏర్పాటు చేయాలన్నారు. జె.ఏ.సి అఖిలపక్షం నూతన మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల ఏర్పాటే లక్యంగా దీక్షలో అన్ని గ్రామాల జె.ఎ.సి అఖిలపక్షనాయకులు పాల్గొన్నారు.