Wednesday, 4 November 2026

పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దాం

ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి
పానుగల్ సెప్టెంబర్ 19( జనం సాక్షి)
 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం కొత్తపేట గ్రామంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న, సందర్భంగా ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామాలలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో స్వచ్ఛతను మెరుగుపరిచి, తడి పొడి చెత్త నిర్వహణపై ప్రజలలో అవగాహన పెంపొందించాలని,బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ ను, అదేవిధంగా నీటి వనరులను సంరక్షించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నీలమ్మ , పారిశుద్ధ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area