Monday, 2 November 2026

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే శ్రేయస్కరం – లయన్స్ క్లబ్ సభ్యులు డా: సీత

బాలానగర్ జనం సాక్షి 31:
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి  వినాయక విగ్రహాలనే పూజించాలని లయన్స్ క్లబ్ సభ్యురాలు డాక్టర్ సీత తెలిపారు. శనివారం బాలా నగర్ లోని శాంతి మెడికల్ హాల్ నిర్వాహకులు సుధాకర్ ఆధ్వర్యంలో ఆమె మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి విగ్రహాల వినియోగంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద అ విగ్రహాలను సైతం మట్టితో తయారుచేసే విధానం అందుబాటులో కి వచ్చినప్పుడే చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ఉంటాయన్నారు. అనంతరం డివిజన్ పరిధిలోని నిరుపేద కార్మికులకు 1,116 మట్టి వినాయక విగ్రహాలను డాక్టర్ సీత పంపిణీ చేశారు.