జహీరాబాద్ ఆగస్టు 31(జనంసాక్షి ) ఝరాసంగం మండల పరిధిలోని కమల్ పల్లి లో శనివారం హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి నాయకులు నరోత్తం, రాయికోడ్ జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్ లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. హెల్పింగ్ హ్యాండ్ చేస్తున్న సేవలను కొనియాడారు. హెల్పింగ్ హాండ్స్ చైర్మన్ మోరంగిపల్లి జైపాల్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పనిచేస్తుందన్నారు. సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవ కార్యక్రమలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్య సామాగ్రి అందజేస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ సంపూర్ణ స సంగ్రామ్ పాటిల్ ఎంపీటీసీ ఉమామారుతి రావు పాటిల్ ప్రధానోపాధ్యాయులు సంగమేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగేష్ ,కృష్ణ, హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ప్రతినిధులు ఆనంద్ ,దేవదాస్, దావీద్ ,రాజు గ్రామస్తులు సంజీవ్, చంద్రయ్య, సంగమేశ్వర్ ,తదితరులు పాల్గొన్నారు.




