Thursday, 5 November 2026

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

2వేలజూట్ బ్యాగులు ఉచితంగ పంపిణీ
 వీరశైవ యువధల్ అధ్యక్షులు పటేల్ ప్రవీణ్ కుమార్
 తాండూరు. అక్టోబర్19( జనం సాక్షి) పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలని వీరశైవ యువధళ్ అధ్యక్షులు పటేల్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం దసరా పండుగ పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ యువధల్ ఆధ్వర్యంలో 2వేల జూట్  బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు .అదేవిధంగా ప్లాస్టిక్ భూతాన్ని పారదోలి రాబోయే తరాలకు మేలు చేద్దామని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడటం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ,వాటిని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా రెండువేల జూట్ బ్యాగులను పంపిణీ చేశామని సూచించారు. పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించి ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ సభ్యులు ,వీరశైవ యువ దల్ కార్యదర్శి అభిషేక్ సంగిశెట్టి సంతోష్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.