తాండూరు అక్టోబర్ జనం సాక్షి
తాండూర్ నియోజకవర్గ రమేష్ మహారాజ్ యువసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పునీత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ కి ఎనలేని సేవలు అందించానని అన్నారు. రమేష్ మహారాజ్ పై ఉన్న అభిమానంతో ఆయన పేరిట యువసేన ను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించానని పేర్కొన్నారు .అయితే తాండూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గా ఉన్న రమేష్ మహారాజ్ అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం నన్ను తీవ్రం మనస్థాపానికి గురి చేసిందని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి గుర్తింపు లేదని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో పాటు రమేష్ మహారాజ్ యువసేన నియోజవర్గ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.




