పలు గ్రామపంచాయతీ సర్పంచుల ఆధ్వర్యంలో. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

బచ్చన్నపేట సెప్టెంబర్ 26 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామపంచాయతీ ల. సర్పంచులు. కార్యదర్శుల ప్రజల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా 127 వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ. తెలంగాణలో భూమికోసం భుక్తి కోసం. పీడిత అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది చాకలి ఐలమ్మ అని ఆమె గొప్పతనాన్ని ఔనిత్యాన్ని ధైర్య సాహసాలను కొనియాడారు. నారాయణపురం గ్రామ సర్పంచ్ మాసాపేట రవీందర్ రెడ్డి. సాల్వపూర్ సర్పంచ్ కీసర లక్ష్మి. గంగాపూర్ సర్పంచ్ సుశీల. చిన్న రామ చర్ల సర్పంచ్ కళినా బేగం. కొడవటూరు గ్రామ కార్యదర్శి రూప. ఆయా గ్రామాల సర్పంచుల ఎంపిటిసిల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు