హైదరాబాద్,ఆగస్టు25(జనం సాక్షి ) : జలమండలి బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా బొమ్మకల్ నుంచి జంట నగరాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ను పునరుద్ధరించిన వెంటనే జంట నగరాలకు నీటిని సరఫరా చేయనున్నారు అధికారులు.బొమ్మకల్‌లో 220 కేవీ సబ్‌స్టేషన్‌తో విద్యుత్ అంతరాయం కారణంగా నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, బాలానగర్,మూసాపేట్, అల్వాల్, డిఫెన్స్ కాలనీ, సైనిక్‌పురి ప్రాంతాల్లో నేడు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
—————




