Wednesday, 4 November 2026

పశువుల చర్మవ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

జనం సాక్షి, మిర్యాలగూడ. పశువుల ముద్ద చర్మవ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జె వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఉట్లపల్లి రాయిని పాలెం. తదితర గ్రామాల్లో ఆవులకు టీకాలు వేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ126 ఆవులకు టీకాలు వేశామని ఆయన తెలిపారు. రైతులు పశువుల్లో వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.టీకాలతో వ్యాధిని నివారించవచ్చని ఆయన రైతులకు సూచించారు వారి వెంట డాక్టర్ నాయిని దుర్గా రమాదేవి. డాక్టర్ అనుదీప్.సిబ్బంది శ్రీనివాసులు. చాంద్ పాషా. సుభానా మహమూద్. శ్రీకాంత్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు