పాగుంట గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు…

ధరూర్ సెప్టెంబరు 26 (జనంసాక్షి):- నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ., బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక ..అని గ్రామ సర్పంచ్ సుభాషిణి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.ఐలమ్మ జయంతి  సందర్భంగా సర్పంచ్ సుభాషిణి విష్ణువర్ధన్ రెడ్డి  ఆమెకు నివాళులర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో ఆమె సేవలను రాష్ట్రం మొత్తం స్మరించుకున్నారని తెలిపారు..భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని సీఎం అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని అన్నారు.హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తున్నదని  తెలిపారు. ఐలమ్మ గారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని  తెలిపారు.. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుజాత స్వామి, పంచాయతీ సెక్రెటరీ రామన్ గౌడ్, అంగన్ వాడి టీచర్స్ వెంకటేశ్వరమ్మ,మాధవి,బుక్ కిపర్ భాగ్యమ్మ,డీలర్ భీంరెడ్డి, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.