పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ ల అందజేత
మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 18 : మద్దూరు మండలం వల్లంపట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్, ఫోరం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆలేటి రజిత-యాదగిరి ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిపామ్ లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలల్లో 126 మంది విద్యార్థులు ఉండగా కేవలం 66 మందికి మాత్రమే బట్టల పంపిణీ చేసి మిగతా 60 మంది విద్యార్థులకు బట్టలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా విద్యార్థులకు బట్టలు పుస్తకాలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న ప్రేమ విద్యార్థుల చదువులపై వారి సౌకర్యాల మీద లేదన్నారు. ఇప్పటికైనా తమ పాఠశాలతో పాటు అన్ని పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు సరిపడా యూనిఫామ్ లు పుస్తకాలు పంపిణీ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలభాస్కర్, ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, రాములు, భాస్కర్ శ్రీనివాస్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.