మల్దకల్. మండల పరిదిలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్న, ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం పంపిణీ చేసేన పుస్తకాలను శనివారం ఎంఇఓ స్వామి ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు గంగన్న, ప్రసన్న, సిఆర్‌పి పద్మావతమ్మ, పరుమన్నతదితరులు పాల్గోన్నారు. మండలంలోని 39 ప్రభుత్వ పాఠశాలలో 6220మంది విద్యార్థులున్నారని వారికి సరిపడాపుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలానికి 70శాతం పుస్తకాలు వచ్చాయని 30 శాతం పుస్తకాలు రెండవ విడతలో వస్తాయని ఎంఇఓ తెలిపారు. అదేవిధంగా ప్రతి పాఠ్యపుస్తకంపై సీరియల్ నెంబర్ ఉంటుందని, ఈ నంబర్ పుస్తకం ఏ విద్యార్థికి ఇచ్చారో ఆ నెంబర్ ను ఆన్‌లైన్ లో నమోదు చేయాలని సూచించారు.
పాఠ్యపుస్తకాల పంపిణీ




