Thursday, 5 November 2026

తండ్రిని చంపిన తనయులు అరెస్టు

మల్దకల్‌. మండల పరిదిలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాములు అనే వ్యక్తిని తనయులైన శ్రీను, విజయ్‌ లు ఈనెల 24న ఆస్తికోసం హత్య చేయగా వారిని మల్దకల్‌ ఎస్సై నవీన్‌సింగ్‌ ఆద్వర్యంలో అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌ కు తరలించారు. ఈ సందర్బంగా సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిఎస్పీ సురేందర్‌ రావు మాట్లాడుతు వెంకట్రాములుకు 7 ఎకరాల భూమి ఉండగా ప్రతి ఏటా కౌలుకు వేసేవాడని ఈ సారి కూడా వేయడానికి ప్రయత్నం చేయగా కోడుకులు తాము సాగు చేస్తామని తండ్రితో తగవుపడి ఓకరిపై ఓకరు తీవ్ర తగవుగా మారడంతో తనయులు సిమెంట్‌ దిమ్మెతో తండ్రి తలపై కోట్టడంతో ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌ తరలించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌సింగ్‌ తదిరులు పాల్గోన్నారు.