పాడి రైతుల సంక్షేమమే సంస్థ లక్ష్యం…
చైర్మన్ రాజేశ్వర్ రావు..
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 8
పాడి రైతుల సంక్షేమమే కరీంనగర్ డైరీ సంస్థ లక్ష్యమని చైర్మన్ రాజేశ్వర్ రావు అన్నారు. గురువారం మండలంలోని కొత్తగట్టు శివారులో గల కరీంనగర్ డైరీ యూసీబీ యూనిట్ ప్లాంట్ లో పాడి రైతులకు భీమా చెక్కులను రాజేశ్వర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు. రాజేశ్వరరావు మాట్లాడారు. కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలోని కొత్తగట్టు బీసీలు పరిధిలోని ఎం పి ఐ లో పాలు పోస్తున్న పాడి రైతులు ఇటీవల పలు కారణాలతో మృతిచెందగా వారి కుటుంబాలకు అండగా కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో భీమా చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్క సభ్యునికి 50వేల రూపాయల చొప్పున బీమా వర్తింపజేయుటకు సంస్థ కృషి చేసిందని తెలిపారు. ఈ నెల 16 నుండి రైతులకు పాలధర కూడ రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం కేజీ ప్యాట్ ధర 740 రూపాయలకు సమస్త పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైరి బోర్డు డైరెక్టర్లు మాడ వెంకట్ రెడ్డి, మరుపాక రాజు, ఎంసీసీ మేనేజర్ రమేష్.ముస్కుఅంజిరెడ్డి, తిరుపతి వివిధ గ్రామాల డైరి అధ్యక్షులు, పాడి రైతులు పాల్గొన్నారు.