పాత పెన్షన్ల కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ శశికళ-శ్యామ్.
ఝరాసంగం సెప్టెంబర్ 27( జనం సాక్షి) ఝరసంగం మండలం దేవరంపల్లి గ్రామంలో పాత పింఛన్లు మంగళవారం గ్రామ పంచాయతీ రాజ్ భవన్ ఆవరణలో లబ్దిదారులకు స్థానిక గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, మొద్దు కాలు ఉన్నవారికి, ఫైలేరియా వ్యాధి ఉన్నవారికి, ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారికి, రూ 2,016, మరియు వికలాంగులకు రూ 3,016.ఇచ్చే రాష్టం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల అన్ని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ శివ శంకర్ యాదవ్, పంచాయతీ సెక్రటరీ రవి, వార్డు మెబర్స్ సాయన్న, శేఖర్, సాయమ్మ, చెంద్రమ్మ, ఎల్లిశమ్మ, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.