– రూ. 10లక్షలు దాటే ప్రతి లావాదేవీకి పాన్‌కార్డు తప్పనిసరి
హైదరాబాద్,అక్టోబర్24(జనంసాక్షి) : కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కీంలకు ఆధార్ తప్పని సరి చేసింది ప్రభుత్వం. దీనికి తోడు భూములు, స్థలాలు, ప్లాట్ల రిజిస్టేష్రన్లకు పాన్‌కార్డును కూడా తప్పనిసరి అంటోంది. రూ.10లక్షలు దాటే ప్రతి లావాదేవీకి పాన్‌కార్డు ఉండాల్సిందే. లేదంటే? అలాంటి భూముల రిజిస్టేష్రన్లను తిరస్కరించాల్సిందిగా స్టాంపులు, రిజిస్టేష్రన్ల ఇన్స్పెక్టర్ జనరల్ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అధికారులు అమ్మకందారు, కొనుగోలుదారులకు సంబంధించిన
ఆధార్‌కార్డు నంబర్లు ఉంటేనే సబ్ రిజిస్టార్ర్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేస్తున్నారు. లేదంటే అలాంటి డాక్యుమెంట్లను రిజక్ట్ చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.2 లక్షలకు మించి జరిగే లావాదేవీల గురించి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదాయపన్నుశాఖ అన్ని బ్యాంకులను అప్పట్లోనే ఆదేశించింది. ఇందులో భాగంగానే రిజిస్టేష్రన్ల లావాదేవీల సమాచారాన్ని కూడా రాబట్టింది. అంతకుముందు రూ.30లక్షలకు మించిన రిజిస్టేష్రన్ల సమాచారం మాత్రమే ఆదాయ పన్ను శాఖకు వెళ్లేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.10లక్షలకు మించే రిజిస్టేష్రన్ల సమాచారాన్ని అందజేయాలని రిజిస్టేష్రన్ల శాఖను ఆదేశించింది. దీంతో జనవరి నుంచి రూ.10 లక్షలకు మించిన రిజిస్టేష్రన్ల సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు బదిలీ చేస్తూ వస్తుంది. అయితే అమ్మకందారు, కొనుగోలుదారులకు సంబంధించిన పాన్‌కార్డులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. తాజాగా పాన్ కార్డు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని రిజిస్టేష్రన్ల శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగే రూ.10లక్షల విలువైన రిజిస్టేష్రన్లన్నింటికీ పాన్‌కార్డులను తీసుకోవాలని ఐజీ ఆదేశించారు. రూ.10 లక్షలలోపు రిజిస్టేష్రన్లకు ఇది అవసరం లేదని, అయితే రూ.10 లక్షలు దాటే ప్రతి రిజిస్టేష్రన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెంటనే ఆదాయపన్ను శాఖకు బదిలీ చేస్తున్నారు. దీంతో పాటే అమ్మకందారు, కొనుగోలుదారుకు సంబంధించిన పాన్ కార్డుల వివరాలను డిజిటల్ రూపంలో పంపిస్తున్నారు. దీంతో ఎవరి పేరుతో ఎంత స్థిరాస్తులున్నాయన్న వివరాలు ఆదాయపన్ను శాఖకు అందే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు జరిపే రైతులకు ఈ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకేసారి ఇలాంటి నిబంధనలు పెట్టడంతో పాన్‌కార్డు కోసం రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.




