Tuesday, 3 November 2026

పారదర్శకంగా ధూపదీప నైవేద్యం

హైదరాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి): ధూప దీప నైవేద్య పథకంలో అనర్హులకు చోటు కల్పిస్తే అధికారులపై చర్యలు తప్పవు అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఆ శాఖపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో సమస్యలు, ధూప దీప నైవేద్యం, ప్రత్యేక అభివృద్ధి నిధులపై చర్చించారు. అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆగస్టు నుంచి మరిన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపు చేస్తామన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర, ధర్మపురి ఆలయాల మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ సందర్భంగా దేవాలయాల్లో సమస్యలు, ధూప దీప నైవేద్యం, ప్రత్యేక అభివృద్ధి నిధులపై చర్చించారు.మరోవైపు, అర్చకులు, ఆలయ ఉద్యోగుల క్యాడర్‌ స్టెంత్‌ నిర్ధారణకు కసరత్తు కొనసాగుతోంది. త్వరలోనే ఉత్తర్వుల జారీకి రంగం సిద్ధం చేస్తున్నారు.