Tuesday, 3 November 2026

ఎసిబి వలలో సంతకవిటి వ్యవసాయాధికారి

శ్రీకాకుళం,జూలై2(జ‌నం సాక్షి): అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వ్యవసాయశాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏవోగా పనిచేస్తున్న జి.రంగారావు రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుపడ్డారు. సంతకవిటి మండలం, సిరిపురానికి చెందిన సప్తగిరి ఏజెన్సీ నుంచి అనుమతుల కోసం రంగారావు డబ్బులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మరో రూ. 46వేలు అనధికారికంగా ఉన్న నగదును అధికారులుస్వాధీనం చేసుకున్నారు.