Wednesday, 4 November 2026

పారిశుద్ధ కార్మికులకు రక్షణ కిట్లను పంపిణీ చేసిన : కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ఎల్బీ నగర్ (జనం  సాక్షి ) బి యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బి యన్ రెడ్డి నగర్ ఫేస్ 1వైదేహి నగర్ సాహెబ్ నగర్ లోని జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులకు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి  రక్షణ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిశుద్ధ కార్మికులకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని , డివిజన్లో శివారు ప్రాంతాలలో ప్రజలు పెరగడంతో నూతన కార్మికులు లేక ఎక్కడ చెత్త కుప్పలు అక్కడ పేరుకపోవుతున్నాయని కావున నూతన కార్మికులను చేర్చుకోవాలని,  కార్మికులకు సరిపడే వేతనాలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో  కాలనీ అధ్యక్షులు రాజీ రెడ్డి, దామోదర్ రెడ్డి, పార్టీ చెనేత మొర్చ కన్వీనర్ రఘురాం నేత, డివిజన్ ప్రధాన కార్యదర్శి ముడుపు సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు పవన్ రెడ్డి, కిషోర్,కాలనీ సభ్యులు కృష్ణయ్య, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, అలెగ్జాండర్, శ్రీనివాస్ గౌడ్, ధనరాజ్, బిక్షపతి, జిహెచ్ఎంసి SS అజీమ్, జవాన లక్ష్మయ్య ,SFA పురుషోత్తం, బాలకృష్ణ, గోవర్ధన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.