పారిశుభ్య కార్మికులకు ఉచితముగా నెలవారీ పచారీ సమన్లు , సరుకులు ఉచిత పంపిణి
ఎల్బీ నగర్ (జనం సాక్షి )లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జి హెచ్ ఎమ్ సి సంయుక్తముగా షెపర్డ్ సంస్థ ద్వారా సరూర్ నగర్ సర్కిల్ 5 డిఇఇ నీలిమ , సర్కిల్ 4 డిఇఇ వెంకటేష్ కు సంబందించిన పారిశుభ్య కార్మికులకు , పేద కార్మికులకు ,వాచ్మెన్ లకు ఉచితముగా నెలవారీ పచారీ సమన్లు , న్యూట్రిషన్ కు చెందిన 2000 క్వాంటిటీ సరుకులు ఉచిత పంపిణి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రొయ్యురి సురేష్ , షెపర్డ్ సంస్థ చైర్మన్ , జి హెచ్ ఎమ్ సి డిప్యూటీ కమిషనేర్ హరి కృష్ణయ్య ,లయన్ డాక్టర్ బి విజయ్ రంగ ‘జిల్లా చైర్మన్ హెల్త్ కేర్ ,కొట్టం జంగయ్య యాదవ జోన్ చైర్మన్ , విజయ గౌడ్ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కాలనీ అధ్యక్షులు కృష్ణ మూర్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు .