ఘనంగా ముక్కెర రిక్కీ జన్మదిన వేడుకలు

.. ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 21, ( జనం సాక్షి ) : మండలంలోని కొత్తపెళ్లి గ్రామ ఉపసర్పంచ్ ము క్కెర మహేందర్ కుమారుడు ముక్కెర రిక్కీ జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమ కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్టేషన్ ఘన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామ ఉపస ర్పంచ్ ముక్కెర మహేందర్ కుమారుడు ముక్కేర రిక్కీ జన్మదినం సందర్భంగా తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజ య్యని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోగా ఎమ్మెల్యే రాజయ్య రిక్కి చేత బర్త్డే కేక్ కట్ చేయించి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆకుల కుమార్, మ హేందర్ రెడ్డి, సర్పంచ్ ఆనందం, ఉప సర్పంచ్ ముక్కెర మహేందర్, అశోక్, లింగస్వామి తదిత రులు పాల్గొన్నారు.