*ఒకే కుటుంబంలో ఇద్దరికి సీఎంఆర్ఎఫ్*
*బీజేపీ క్రియాశీల కార్యకర్తకు సీఎంఆర్ఎఫ్*
కొడకండ్ల, ఆగస్ట్27(జనం సాక్షి):
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సిఎమ్ఆర్ఎఫ్ చెక్కుల పంపిణి.
మండలంలోని నిలిబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు జి.భన్సి,రమేష్ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా
ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫారసు చేసుకోగా గుగులోత్ బన్సీ కి రూ. 14,000,గుగులోత్ రమేష్ బీజేపీ క్రియాశీల కార్యకర్తకు రూ. 25000 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా ఇట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక సర్పంచ్ ధరావత్ విమల-సోమాని, గ్రామపార్టీ అధ్యక్షుడు గుగులోత్ దేవా ఆధ్వర్యంలో కుటుంబానికి చెక్కులు అందజేయడం జరిగింది.అనంతరం సర్పంచ్ విమల మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కెసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, ఏ పార్టీ అయినా, ఏ వర్గం అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం అందాలన్నదే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లక్ష్యం అని తెలిపారు.మంచితనానికి నిలువెత్తు నిదర్శనం,ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని,పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకుడు మన ఎర్రబెల్లి దయాకర్ రావు అని అన్నారు.అదేవిధంగా మండలం లోని రామేశ్వరం గ్రామానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారురాలు అయిన ఎమ్.విజయకు 25000 వేల రూపాయల చెక్కును అందించిన స్థానిక సర్పంచ్ రాములు నాయక్.అనంతరం సర్పంచ్ రాములు నాయక్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు నినాదమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు భూక్య మహేందర్, భూక్యా దస్రు నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోమేశ్వర రావు,మండల ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్,గ్రామా ప్రజలు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




