పార్టీ మారిన సర్పంచ్ దిష్టిబొమ్మ దగ్ధం

మునుగోడు అక్టోబర్02(జనంసాక్షి):
మండలంలోని కల్వకుంట్ల గ్రామసర్పంచ్ పగిళ్ల భిక్షం సిపిఎం పార్టీలో గెలిచి ఇటీవల బిజెపి పార్టీకి చేరడంతో ఆ పార్టీ కార్యకర్తలు సర్పంచ్ దిష్టిబొమ్మను ఊరేగింపు చేసి దగ్ధం చేశారు.ఈసందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మిర్యాల భరత్ మాట్లాడుతూ గ్రామప్రజలు నమ్మి తనను గ్రామసర్పంచ్ గా గెలిపించుకున్న సిపిఎం పార్టీ కార్యకర్తలను గ్రామ ప్రజలను మోసం చేస్తూ డబ్బుల కోసం పార్టీ మారిన సర్పంచి వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తూ గ్రామంలోని ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నారబోయిన నరసింహ,అయితగొని యాదయ్య,బొందు చిన్ననరసింహ,బొందు అంజయ్య,కట్ట ఆంజనేయులు,బొందు సుందరయ్య,బయ్య సురేష్,కట్ట లింగస్వామి,కట్ట వెంకన్న, బొందు నవీన్,పగిళ్ల మధు గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.