పాలాభిషేకం చేసిన తెరాస నాయకులు*

మెట్ పల్లి టౌన్, సెప్టెంబర్ 22: జనం సాక్షి
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యోగక్షేమాలు ఆలోచించి తన వంతు కృషి పట్టుదలతో,తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో మెట్ పల్లి పట్టణానికి అవసరమని భావించి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్య సాగర్ రావు
ముఖ్యమంత్రి కెసిఆర్ కు, మంత్రులకు, మరియు సంబంధించిన అధికారులకు విజ్ఞప్తి చేయగా, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదించారు.ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన కృషి పట్టుదలకు పట్టణ టిఆర్ఎస్ నాయకులు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.పాత బస్టాండ్ ప్రాంతంలో టిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు బత్తుల భరత్, యూత్ ఉపాధ్యక్షులు కారం శివ, యూత్ నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నమ్ రమేష్ నరేష్ న్యాత ప్రశాంత్ తదితరులు ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు…