పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి( కారు) కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్తులు .

పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి( కారు) కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్తులు .

ఖమ్మం తిరుమలాయపాలెం (అక్టోబర్ 9) జనం సాక్షి. మండల పరిధిలోని బచ్చోడు పర్యటన కు వెళ్లిన కందాల ఉపేందర్ రెడ్డి కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.బచ్చోడు అభివృద్దికి ప్రత్యేక కృషి చేయాలని, బచ్చోడును ప్రత్యేక మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనచేపట్టారు. ఎన్నోసార్లు బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి ఎన్నిసార్లు వినతిపత్రం అందజేసిన స్పందించలేదని. వెంటనే మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని.నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను ఎమ్మెల్యే కాన్వాయి వద్దకు రావాలని పోలీసులు జోక్యం చేసుకోవడంతో. గ్రామస్తుల మేము రాము ఎమ్మెల్యే కారుదిగివచ్చి మాకు సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ నన్ను గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను మీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బచ్చోడు మండలం గా ఏర్పాట్లు ఎమ్మెల్యే తోడ్పాటు ఎంత ఉంటుందో వేచి చూడాల్సిందే.