Thursday, 5 November 2026

*పిచ్చికుక్క స్వైర విహారం..

*ఐదుగురిని కరిచిన శునకం..
*మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు..
*బొమ్మలరామారం మండలంలో ఘటన..
బొమ్మలరామారం, జనం సాక్షి
బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో కొరమైన సాయి అనే మూడేళ్ళ బాలుడి దవడపై పిచ్చి కుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అంతటితో ఆగకుండా గ్రామంలో మరో ఐదుగురిన కరిచిన శునకం.గాయాలైన సాయిని భువనగిరి ఏరియా హాస్పిటల్ తరలించగా ప్రధమ చికిత్స నిర్వహించి. మెరుగైన చికిత్స కోసం నారాయణగూడ హాస్పిటల్ తరలించారు.ఇకనైనా ఇలాంటి దాడులు పునరావృతం కాకముందే అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి పిచ్చి కుక్కల నియంత్రణ కు చర్యలకు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.