మిర్యాలగూడ. జనం సాక్షి
మహిళల అభ్యున్నతికి సిపిఐ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం యాద్గార్ పల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు జరపాల్సి ఉన్నప్పటికీ అది ఎక్కడ అమలు జరగడం లేదని అన్నారు. బాలికలు. మహిళలపై అఘాయిత్యాలు. అత్యాచారాలు నిత్య కృత్య మాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలు. పథకాలు అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళల సంక్షేమం కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉందని వాపోయారు మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలు. పథకాలు. కాగితాల కాయ పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించి మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు దాసర్ల దుర్గమ్మ. ఎస్.కె షమీం. లింగంపల్లి సైదమ్మ. గోగుల యాదగిరి. చింతమల రాములు. పున్నమ్మ. మల్లెబోయిన పద్మ. వెంకటమ్మ పాల్గొన్నారు
Attachments area




